Railway Jobs : 10th, ITI అర్హతతో రైల్వేలు గ్రూప్ డి ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్ | RRB Group D Recruitment 2025 Upcoming Notification Eligibility All Details in Telugu
RRB Group D Recruitment 2025 :భారతీయ రైల్వే నియామక బోర్డు (RRB) గ్రూప్ D పోస్టుల కోసం సుమారు 32,000 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. ఈ నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ CEN 08/2024 ద్వారా విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.
RRB గ్రూప్ D పోస్టుల ముఖ్యమైన తేదీలు
• నోటిఫికేషన్ విడుదల తేదీ: 2024 డిసెంబర్ 28
• ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 జనవరి 23
• దరఖాస్తు చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 22
RRB గ్రూప్ D పోస్టుల ఖాళీలు:
ఈ నియామకంలో పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఖాళీల సంఖ్య సుమారు 32,438 గా ఉంది.
RRB గ్రూప్ D పోస్టుల అర్హతలు:
•విద్యార్హత: 10వ ఉత్తీర్ణత లేదా ITI లేదా తత్సమానం లేదా NCVT ద్వారా మంజూరు చేయబడిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
• వయస్సు: 2025 జూలై 1 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
RRB గ్రూప్ D పోస్టుల దరఖాస్తు రుసుము
• సాధారణ మరియు OBC అభ్యర్థులు: ₹500 (CBT పరీక్షకు హాజరైన తర్వాత ₹400 తిరిగి చెల్లించబడుతుంది)
• SC/ST, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు: ₹250
RRB గ్రూప్ D పోస్టులఎంపిక ప్రక్రియ
• కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
• ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
RRB రైల్వే గ్రూప్ D పోస్టుల దరఖాస్తు విధానం:
• అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.
• “CEN-08/2024 గ్రూప్ D రిక్రూట్మెంట్” లింక్‌పై క్లిక్ చేయండి.
• మీ వివరాలతో రిజిస్టర్ చేయండి.
• అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
• రుసుము చెల్లించండి.
• దరఖాస్తును సమర్పించండి మరియు ప్రింట్ తీసుకోండి.
RRB గ్రూప్ D పోస్టుల ముఖ్య సూచనలు
• అభ్యర్థులు ఒకే RRB కి మాత్రమే దరఖాస్తు చేయాలి.
• దరఖాస్తు సమయంలో సరైన వివరాలు మరియు డాక్యుమెంట్లు సమర్పించాలి.
• ఎంపికైన అభ్యర్థులు భారతదేశం వ్యాప్తంగా ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
🛑Notification Pdf Click Here
🛑Qualification Pdf Click Here
ఈ నియామకం భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలను పొందడానికి అభ్యర్థులకు మంచి అవకాశం. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మరియు దరఖాస్తు ప్రక్రియను సమయానికి పూర్తి చేయడం అవసరం.